ప్రముఖులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

ప్రముఖులకు నివాళి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

జయపురం: ఒడిశా పక్ష వేడుకల స్థానిక విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో మహానుభావులకు నివాళి కార్యక్రమం నిర్వహించింది. విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమమానికి ఆ విభాగ అధిపతి డాక్టర్‌ రుషబ్‌ కుమార్‌ సాహు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అరుణ కుమార్‌ రాజ్‌ స్వాతంత్ర పోరాటంలో సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ నిర్వహించిన భూమికను వివరించి నివాళులు అర్పించారు. కెప్టెన్‌ డాక్టర్‌ లక్ష్మణ పాత్రో స్వామి వివేకానంద చరిత్ర ను వివరించారు. అలాగే చరిత్ర విభాగ అధికారి రుష్‌భ్‌ కుమార్‌ సాహు ఉత్కళ గౌరవ మధుసూదన దాస్‌ ప్రత్యేక ఉత్కళ రాష్ట్ర కొరకు సాగించిన ఉద్యమంలో నిర్వహించిన భూమికపై ప్రసంగించారు. డాక్టర్‌ అనూరాధ పాల్‌ రమాదేవి రాష్ట్రానికి అందించిన సేవలను, డాక్టర్‌ మీనతి నాయిక్‌ రాజర్షి విక్రమదేవ్‌ వర్మ విద్యా, భాషా ప్రగతికి అందించిన సేవలను విపులీకరించారు. డాక్టర్‌ హృశికేష్‌ బెహర గోపబందు దాస్‌ చరిత్ర పైన, డాక్టర్‌ లలితేందు లెంకా స్వాతంత్య్ర యోధుడు బాజీ రౌత్‌ పైన, ప్రియరంజన్‌ సాహు మహారాజ కృష్ణ చంద్ర గజపతి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర పైన ప్రసంగించారు. అదేవిధంగా కిశోర్‌ గురు ఉద్యమ కారుడు వీర సురేంద్ర సాయి పై ప్రసంగించగా ఇతర అధ్యాపకులు ప్రసంగిస్తూ ఆ మహానుభావుల జీవితాలు, వారి సిద్ధాంతాలు, సమాజానికి చేసిన అమూల్యమైన సేవలను విస్తృతంగా వివరించారు. వారి ఆదర్శాలు విలువలు, దేశ భక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆధునిక కాలంలో ఆ మహానీయుల త్యాగాలను విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు సుకాంతి సోయ్‌ ఒడియా పక్ష ప్రాధాన్యతను వివరించారు

Advertisement
 
Advertisement
Advertisement