సమగ్ర విద్యా బోధనపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సమగ్ర విద్యా బోధనపై శిక్షణ

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

జయపురం: జయపురం బ్లాక్‌ విద్యా విభాగ పరిధిలోని బరిణిపుట్‌ ప్రాథమిక పాఠశాలలో బరిణిపుట్‌ కమ్యూనిటీ సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సమగ్ర విధ్యాబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సమగ్ర విద్యా బోధన సామగ్రి తయారు చేయటంపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యాధికారి జ్యోతీ రంజన్‌ త్రిపాఠీ సమర్ధవంతంగా పాఠ్య బోధన అందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమ పరిశీలన అధికారిగా జయపురం బ్లాక్‌ విద్యా కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ శశిభూషణ దాస్‌ శిక్షణ శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. శిబిరాన్ని బరిణిపుట్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు ప్రఫుల్ల మండల్‌, సహాయ ఉపాధ్యాయులు గీతా రాణి సాహు, ఆర్‌.సబిత శిబిరాన్ని పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement