రాయగడ: రాయగడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ మంగళవారం పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఆ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఉదయం 8 గంటలకు కొరాపుట్ జిల్లా ఉమ్మర్‌కొట్ నుంచి బయలుదేరి ఉదయం 11.45 గంటలకు రాయగడలో గల సర్‌క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు రాయగడ జిల్లా ప్లానింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చేపడతారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై తిరిగి ఉమ్మర్‌కొట్‌కు బయలుదేరుతారు.


