● ఒడియా పక్షోత్సవాల్లో పిండి వంటలు, ముగ్గుల పోటీలు
పర్లాకిమిడి: ఒడియా ‘పక్ష’ వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక బిజూ కల్యాణ మండపంలో పురపాలక పరిధిలో పలు మహిళా స్వయం సహాయక గ్రూపులు ‘మన వంటలు..మన రుచులు’ పేరిట పలు పిండి వంటలు, రంగవళ్లుల పోటీలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏ.డి.ఎం. ఫల్గుణి మఝి, పురపాలక సంఘం చైర్‌పర్సన్ నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, సివిల్ సప్‌లై ఇన్‌స్పెక్టర్ తపస్వినీ బెహరా తదితరులు విచ్చేసి పిండి వంటలను రుచి చూశారు. విజేతలకు మంగళవారం ఒడియా నూతన సంవంత్సరం సందర్భంగా బహుమతులు అందజేస్తామని జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ తెలిపారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రం ఉన్న సంస్కృతి భవన్ ప్రాంగణంలో సోమవారం మన రుచి–మన తిండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళాలు వివిధ రకాల సంప్రదాయ ఒడియా వంట కాలను తయారు చేసి ప్రదర్శించారు. ఉత్తమ బృందాలను బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ కర్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా జిల్లా ఆహార భద్రత అధికారి ప్రభాస్ సేఠీ, తదితరులు పాల్గొన్నారు.
రాయగలో..
రాయగడ: స్థానిక సమితి కార్యాలయంలో సొమవారం నిర్వహించిన మన వంటలు.. మన రుచులు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాగులతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. ఒడియా భాషకు ప్రాచుర్యం ఉన్నట్టే ఒడియా వంటకాలకు ఎంతో ఆదరణ ఉందని వక్తలు పేర్కొన్నారు. సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్, బీడీఓ సుజిత్ మిశ్రా, ఏబీడీఓ కాలు చరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పరేడ్ బృందాల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య అతిథి సురమా పాఢి


