49 యూనిట్ల రక్తం సేకరణ | - | Sakshi
Sakshi News home page

49 యూనిట్ల రక్తం సేకరణ

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

జయపురం: జయపురం రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌కేటీ రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి భవనంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జయపురం ఆర్యవైశ్య సంఘ సభ్యుల సహకారంతో నిర్వహించిన శిబిరంలో 49 యూనిట్ల రక్తం సేకరించారు. రక్తదానం చేయండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోండి, బ్లడ్‌ సర్కులేషన్‌ పెంచుకోండి, కొత్త బ్లడ్‌ సెల్సు క్రియేట్‌ చేసుకోండి, క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించుకోండి రక్తదానం చేయండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి నినాదాలతో రక్తదాతలను ఉత్సాహపరచారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ సభ్యులు జి.వెంకటరావు, కార్యదర్శి సురేష్‌చంద్ర పాణిగ్రహి పాల్గొన్నారు. జయపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవ్వా రామకృష్ణ, రవ్వా నారాయణమూర్తి, గంటి వేంకటేశ్వరరావు, పి.బంగారీరావు రక్తదాతలను ప్రోత్సహించారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలతో పాటు మెమెంటోలను అందజేసి సన్మానించారు. దాతలకు మజ్జిగ, ఫలాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement