మహేంద్రగిరిలో మంత్రి బిభూతి పర్యటన | - | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరిలో మంత్రి బిభూతి పర్యటన

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

పర్లాకిమిడి: రాష్ట్ర మైనింగ్‌, రవాణాశాఖ మంత్రి బిభూతి భూషణ్‌ జెన్నా ఆదివారం రాయఘడ బ్లాక్‌ మహేంద్రగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి విచ్చేశారు. జూన్‌ 2 నుంచి మహేంద్రగిరిలో కుంభ మేళా జరుగుతుందని మంత్రి తెలియజేశారు. మహేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గజపతి జిల్లాప్రత్యేక అభివృద్ధి మండలి చైర్‌పర్సన్‌ కామదేవ్‌ బోడోనాయక్‌, మహేంద్రగిరి పరిరక్షణ మంచ్‌ అధ్యక్షులు లక్ష్మీబాబా, అంతర్యామి గోమంగో, కాశీనగర్‌ బ్లాక్‌ మాజీ సమితి చైర్మన్‌ ఛిత్రి సింహాద్రి, బీజేపీ యువనాయకుడు కోట్ల యువరాజ్‌, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement