పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కలెక్టర్ అక్షయ్ సునీల్ అగ్రవాల్, అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా విచ్చేశారు. 15 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 7, గ్రామ సమస్యలకు సంబంధించినవి 8 ఉన్నాయి. సామాజిక సురక్ష, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో నలుగురు వృద్ధులకు మధుబాబు పింఛన్ కార్డులను కలెక్టర్ అందజేశారు. కాశీనగర్ సమితి చైర్‌పర్సన్ బల్ల శాయమ్మ, బీడీఓ. డంభుధర మల్లిక్, తహసీల్దార్ సుధీర్ కుమార్ నందో, తదితరులు పాల్గొన్నారు.


