వెలుగు తెచ్చింది..
భోగీ వచ్చింది..
పల్లె మురిసింది.. వీధులు కళకళలాడాయి.. ఇళ్లన్నీ సందడిగా కనిపించాయి.. పెద్ద పండుగ పిలుచుకునే సంక్రాంతి సంబరాలు ఆరంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తరువాత ప్రారంభమైన భోగి మంటల వెచ్చదనం బుధవారం రోజంతా కొనసాగింది. చిన్నా..పెద్దా తారతమ్యం లేకుండా అందరూ వేకువజామున సంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించి భోగి మంటల వద్దకు చేరుకొని ఉత్సాహంగా గడిపారు. నూతన వస్త్రాలు ధరించిన పిల్లలు మంటల్లో కట్టెలు, పిడకలు వేసేందుకు చూపారు. అలాగే పిల్లలకు భోగిపండ్లు వేసి పెద్దలు ఆశీర్వదించారు. రంగురంగుల రంగవల్లికతో వీధులన్నీ కలర్‌ఫుల్‌గా కనిపించాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు చేరుకోవడంతో కొంతశోభను సంతరించుకున్నాయి. డూడూ బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి మరింత ఊపుతెచ్చాయి. కాగా గురువారం జరుపుకునే సంక్రాంతి కోసం ఇళ్లన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. పూజలకు కావాల్సిన సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన వారితో మార్కెట్లు రద్దీగా మారాయి.
– సాక్షి నెట్‌వర్క్
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..
వెలుగు తెచ్చింది..


