కమనీయం.. గోదాదేవి కల్యాణం
పర్లాకిమిడి: స్థానిక వేంకటేశ్వర ఆలయంలో నెల రోజులుగా కొనసాగుతున్న ధనుర్మాస పూజలు బుధవారం గోదాదేవి కల్యాణంతో పూర్తయ్యాయి. కోమటివీధి వేంకటేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భద్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీనివాసుడి మహాభక్తురాలు గోదాదేవి వ్రతాలు ఫలించి భోగిపండుగ నాడు శ్రీరంగం శ్రీనివాసులతో వివాహం జరిగిన ఘట్టాన్ని అర్చకులు భద్రం కళ్యాణ్, చక్రధర్ కనుల పండువగా జరిపించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణ ఘట్టాన్ని వీక్షించారు.
కమనీయం.. గోదాదేవి కల్యాణం


