సాగునీరు అందించేందుకు కృషి
● సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి
● పాని పంచాయతీ పక్షోత్సవాల ముగింపులో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సాగునీటి సంఘాల ద్వారా పంట పొలాలకు నీరు అందించడానికి కృషి చేయాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. గుసాని, కాశీనగర్‌లో పాని పంచాయతీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం హాలులో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సంఘాల ద్వారా గుసాని, కాశీనగర్, గుమ్మ సమితిలోని పలు గ్రామాలకు నీరు అందిస్తున్నామని, త్వరలో డంబాపూర్ రిజర్వాయరు నీటిని కృష్ణసాగరానికి కెనాల్ ద్వారా తరలించి రైతులకు సాగునీరు అందిస్తామని చిన్ననీటి పారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సింహాచల శతపతి వివరించారు. అనంతరం వివిధ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ చైర్మన్ జి.తిరుపతిరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మునీంద్ర హానగ, అదనపు చీఫ్ ఇంజినీర్ (వంశధార, నాగావళి బేసిన్) రాంప్రసాదరావు, ఎస్‌ఈ ఇరిగేషన్ డివిజన్ సరోజ్‌కుమార్ నాయక్, ఆశిష్ కుమార్ మల్లిక్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్(మైనర్ ఇరిగేషన్) మనోజ్ చౌదురి తదితరులు పాల్గొన్నారు.
సాగునీరు అందించేందుకు కృషి
సాగునీరు అందించేందుకు కృషి
సాగునీరు అందించేందుకు కృషి


