● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలు కీలకం ● చర్యలు తీసుకోవాలని అధికారుల సూచనలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలు కీలకం ● చర్యలు తీసుకోవాలని అధికారుల సూచనలు

Jul 31 2025 7:44 AM | Updated on Jul 31 2025 9:05 AM

● జిల

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్

కవిటి: ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ వరిసాగు విస్తృత స్థాయిలో సాగుతోంది. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల్లో అధిక దిగుబడుల సాధనకు రైతులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే పంటల పెరుగుదలకు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతో అవసరమని సోంపేట సబ్‌ డివిజన్‌ ఏడీఏ టి.భవానీశంకర్‌ తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్‌ అందుబాటులో ఉన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. జింక్‌, ఇనుము, బోరాన్‌, రాగి, మాంగనీస్‌, మాలిబ్డినం, క్లోరిన్‌ వంటి మూలకాలను సూక్ష్మపోషకాలు అంటారు. నేలలో ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థం లోపం ఉన్నా సరైన ఫలితం ఇవ్వదు. అందువలన నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని పంట లోపాలు నివారించుకోవాలని సూచించారు.

జింక్‌: మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థ వినియోగానికి జింక్‌ చాలా అవసరం.

లోపం: జింక్‌ లోపం ఉంటే మొక్క పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటి న రెండు నుంచి నాలుగు వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇది మిగతా ఆకు అంతటా వ్యాపిస్తుంది. ఆకులు గిడసబారి దుబ్బు చేయవు. పైరుకు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగా ఉండదు

నివారణ చర్యలు: వరి పండించే భూముల్లో ప్రతీమూడు సార్లుకు ఒకసారి, రబీ సీజన్‌ రెండు పంటలు పండించే భూముల్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ చల్లుకోవాలి. భాస్వరం ఎరువుతో జింక్‌ సల్ఫేట్‌ కలిపి వేయరాదు. వీటి మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. జింక్‌ సల్ఫేట్‌ వేయలేని పరిస్థితుల్లో పైరుపై జింక్‌ లోపం కనిపించగానే లీటర్‌ నీటికి రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపి ఐదు రోజుల

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్1
1/1

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement