
జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సమితి సీంద్రమాల పంచాయతీ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బిభూతి ముండాగుడియాను పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రహి మంగళవారం సన్మానించారు. ఇట్టివల మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచింది. ఆటలపై ఉన్న ఇష్టాన్ని గమనించి కోరుకొండ సమితిలో స్వామీ శివానంద పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయురాలు జ్యోత్స్న మహంతి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. కస్తూర్బా పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు సనాతన్ ప్రదాన్ కూడా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వంసతి పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు.