
అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
● రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి
రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయలాంటే అందరి సహకారం అవసరమని జిల్లా నయతన కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అతనికి రాయగడ పాత్రికేయుల సంఘం బుధవారం కలెక్టర్‌లో అభినందించింది. సంఘం సాధారణ కార్యదర్శి శివాజీ దాస్ ఆధ్వర్యంలో సభ్యులు సురేష్ నాయక్, రాజేష్ కుమార్ మహాంతి, అమూల్య నిషాంక, మనోజ్ మిశ్రా, ధరణీధర్ పట్నాయక్, సంఘం ముఖ్య సలహాదారుడు సురేష్ దాస్ తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కాసేపు కలెక్టర్ పాత్రికేయులతో ముచ్చటించి ఇక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయుల దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని.. అందుకు అంతా సహకరించాలని కలక్టర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మౌలిక వసతులకు సంబంఽధించి దృష్టికి వచ్చే సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.