
ట్రాక్‌కు మరమ్మతులు.. నిలిచిన వాహనాలు
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్య ఎల్‌సీ గేట్‌ను రైల్వే అధికారులు మంగళవారం సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల సమాచారాన్ని వాహనదారులకు ముందుగానే అధికారులు తెలియజేశారు. దీంతో కేదారిపురం, ముచ్ఛింద్ర, బెన్నుగానిపేటకు చెందిన విద్యార్థులను రెండో పూటే ఇళ్లకు పంపించేశారు. మిగిలిన వాహనాలు బెన్నుగానిపేట మీదుగా ఇచ్ఛాపురం చేరుకున్నాయి
పూడిలంక వంతెన పనులు పూర్తిచేస్తాం
వజ్రపుకొత్తూరు: పూడిలంక వంతెన పనులు స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రూ.4 కోట్లతో నిర్మించనున్న పూడిలంక వంతెన నిర్మాణ పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచినీళ్లపేట జెట్టీ నిర్వహణకు కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పూడిలంక వంతెన పనులు పూర్తి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిమ్మల కృష్ణారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కణితి సురేష్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు, సైని భాస్కరరావు, టి.గణపతి, రంగారావు, హేమారావు తదితరులు పాల్గొన్నారు.
‘గోవిందరాజులు వ్యాఖ్యలు అర్ధరహితం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ వైఎస్సార్‌సీపీపై బోయిన గోవింద రాజులు చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితమని, ఇదే సంఘంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులుగా ఉన్న తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్ర వైఎస్సార్ సీపీ కళింగ వైశ్య బీసీ అనుబంధ సాధికార కమిటీ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా వైఎస్సార్‌సీపీ కోశాధికారి తంగుడు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కోరాడ చంద్రభూషణగుప్త, వైఎస్సార్‌సీపీ నాయకులు తంగుడు జోగారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరికి పదవులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఏ రాజకీయ పార్టీ ఇలాంటి అవకాశాలు కల్పించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వంతో సీట్లు సర్దుబాటు చేసుకొని మిత్రపక్షంగా ఉంటూ విజయం సాధించిన తర్వాత టీడీపీ కేంద్ర క్యాబినెట్‌లో చేరకపోవడానికి కారణాలను మీ పార్టీ పెద్దలను అడిగి తెలుసుకొని సమాజానికి తెలియజేయాలని కోరారు. బీసీలను బ్యాక్‌బోన్‌గా గుర్తించిన ఏకై క పార్టీ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి కళింగవైశ్యుల కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, 10 కుల కార్పొరేషన్ డైరక్టర్లను, నాలుగు బిజినెస్ కార్పొరేషన్ డైరక్టర్లను, బీసీ కళింగ వైశ్య మహిళకు శ్రీకాకుళం సుడా చైర్మన్ ఇచ్చి కళింగ వైశ్యులను గుర్తించారన్నారు. కూటమి పాలన 14 నెలల్లో పలాసలోని ఒక్క ఏఎంసీ పదవి తప్ప గతంలో ఉన్న మల్లా శ్రీనివాసరావుని కూడా తిరిగి నియమించలేదన్నారు.
టి.డి.వలసలో జ్వరాలపై సర్వే
జి.సిగడాం: టంకాల దుగ్గివలస గ్రామంలో జ్వరాలపై వైద్యసిబ్బంది మంగళవారం ఇంటింటా సర్వే చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జ్వరపీడితుల వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామని ఎంపీడీఓ జి.రామకృష్ణారావు, వైద్యాధికారి బి.యశ్వంత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే గ్రామంలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు.
3న జిల్లాస్థాయి
చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్ట్ 3న నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు బగాది కిషోర్, జామి రమేష్ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం కొత్త రోడ్డు సమీపంలో ఉన్న సీఎస్‌ఎన్ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ ఎంపికలకు 19 ఏళ్లలోపు బాలబాలికలు అర్హు లని పేర్కొన్నారు. విజేతలను త్వరలో కర్నూలు వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ చెస్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపిస్తామని ఆల్ ఇండియా చెస్ ఇన్ స్కూల్ కమిటీ సభ్యులు సనపల భీమారావు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాలబాలికలు జనన ధృవీకరణ పత్రం, రూ.300 ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9912559735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ట్రాక్‌కు మరమ్మతులు.. నిలిచిన వాహనాలు