శ్రీజగన్నాథుని ముఖ చిత్రాలతో డోర్‌మ్యాట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీజగన్నాథుని ముఖ చిత్రాలతో డోర్‌మ్యాట్లు

Jul 30 2025 6:48 AM | Updated on Jul 30 2025 6:48 AM

శ్రీజగన్నాథుని ముఖ చిత్రాలతో డోర్‌మ్యాట్లు

శ్రీజగన్నాథుని ముఖ చిత్రాలతో డోర్‌మ్యాట్లు

భువనేశ్వర్‌: పూరీ శ్రీజగన్నాథుని ముఖ పోలికలతో రూపొందించిన డోర్‌మ్యాట్ల విక్రయ ప్రకటన వివాదాస్పదం అయింది. ఆలీ ఎక్స్‌ప్రెస్‌ అనే వెబ్‌సైట్‌ శ్రీజగన్నాథుని ముఖం ఉన్న డోర్‌మ్యాట్స్‌ అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లు ప్రసారం చేసింది. ఈ ప్రసారం బహిరంగం కావడంతో వివాదం చెలరేగింది. పవిత్ర స్వరూపంగా భావించే శ్రీజన్నాథుని చక్ర నయనాలపై కాలు మోపడం, తుడుచుకోవడం అపచారంగా పరిగణించిన భక్తజనం విచారం వ్యక్తం చేసింది. ఈ చర్యకు వ్యతిరేకంగా తక్షణమే చర్యలు చేపట్టాలని పలు సేవా సంస్థలు స్థానిక సింహద్వారం ఠాణాలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జగన్నాథుని ప్రతిమను సాధారణ వస్తువుగా ఉపయోగించడం హిందూమతంపై ఉన్న అగౌరవాన్ని స్పష్టం చేస్తుంది. ఈ దారుణమైన తప్పును సరిదిద్దడానికి తక్షణ చర్యలు తప్పనిసరి అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చర్యలు తీసుకోవాలని భక్తుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement