
వినతుల వెల్లువ..
జయపురం: జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాభియోగాల శిబిరంలో 36 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 27 ఫిర్యాదులు వ్యక్తిగతం కాగా.. 9 ఫిర్యాదులు కమ్యూనిటీ పరంగా వచ్చాయి. కొరాపుట్ నూతన కలెక్టర్ మనోజ్ సత్యభాను మహాజన్ మొదటి సారి పాల్గొన్న ప్రజాభియోగ శిబిరంలో జయపురం సిటిజన్ కమిటీ వారు చేసిన ఫిర్యాదులో జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో స్పెషలిస్టు డాక్టర్లను తగినంత మందిని నియమించాలన్నారు. పోస్టాఫీసులో రైల్వే టికెట్ కౌంటర్ ప్రారంభించాలని, టంకువ నుంచి రైల్వే స్టేషన్ వరకు సిటీ బస్సు వేయాలని, జనన, మరణ ధ్రువపత్రాలు మునిసిపాలిటీలోనే ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కమిటీ అధ్యక్షురాలు బినోదిని శాంత వినతిపత్రం సమర్పించారు. బరిణిపుట్ పంచాయతీ ముండిగుడ ఒసీసీ కాలనీలో 2 వందల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయాని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, సీడీఎంఓ రబఅంద్రనాథ్ మిశ్ర, ఎస్పీ రోహిత వర్మ, ఐఏఎస్ ప్రొహిబిషన్ సంతోష్ పడర్, తదితరులు పాల్గొన్నారు.
పద్మపూర్‌లో..
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లో జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 60 వినతులను స్వీకరించారు. వాటిలో 53 వ్యక్తి గత సమస్యలుగా, మిగతా 6 గ్రామ సమస్యలుగా గుర్తించారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ప్రధాన్, ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరొజిని దేవి, పద్మపూర్ సమితి అధ్యక్షులు మణిమాల సబర్, తదితరులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ..