
బీజేపీ నాయకుల మాటలు అర్థరహితం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి కత్తలకవిటి పంచాయతీ డాక్టరు బంజిరి గ్రామంలో 43 ఎకరాల భూవివాదంపై బీజేడీ పార్టీపై మాజీ ఎమ్మెల్యే (బీజేపీ) కోడూరు నారాయణరావు చేసిన వివాదాస్పద వాఖ్యలను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ ఖండించారు. వాటి మాటలు అర్థరహితమన్నారు. బీజేడీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టరు బంజరి గ్రామంలో 50 ఎకారాల ప్రైవేట్ భూమిలో 5 ఎకరాల భూమి బరంపురం పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రియాంకా సాబత్ పేరిట రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తెలియజేశారు. ఆర్నెళ్లుగా డాక్టరు బంజిరి భూములు ఆదివాసీ, దళిత ప్రజలకు చెందాలని పోరాడుతుండగా.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మేల్కోని తమ పార్టీ నేతల హాస్తం ఉందని ఆరోపించడం సబబు కాదని జెడ్పీటీసీ (గుసాని) బాలరాజు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, డాక్టరు బంజిరిలో వంద మంది ఆదివాసీ, దళిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా పోరాడితే మంచిదని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ప్రస్తుతం తాము డాక్టరు బంజిరి వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, దీనిపై తుదివరకు పోరాడతామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. గజపతి కలెక్టర్‌తో డాక్టరు బంజిరి భూముల వివాదంపై మాట్లాడతామని ఎమ్మెల్యే పాణిగ్రాహి తెలియజేశారు. విలేకరుల సమావేశంలో గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, ఆర్.ఎం.సి. ప్రెసిడెంట్ ఎస్.గజపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి