
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా, హుషారుగా సాగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అండర్–14, 16, 18, 20 నాలుగు వయో విభాగాల్లో రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్‌లో సత్తాచాటారు. వచ్చే నెల 9 నుంచి 11 వరకు చీరాలలో జరగనున్న రాష్ట్రపోటీలకు విజేతలను పంపిస్తారు. క్రీడాకారుల ట్రాక్ రికార్డు బట్టి తుది జాబితాను ప్రకటిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, అథ్లెటిక్స్ సంఘ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, కె.మాధవరావు, కె.హరిబాబు, తవిటయ్య, శ్రీనివాసరావు, ఆనంద్, మురళి, పద్మనాభరెడ్డి, గోవింద్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. –శ్రీకాకుళం న్యూకాలనీ

ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపికలు

ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపికలు