
యువకుని దారుణ హత్య
రాయగడ: జిల్లా పరిధిలోని కుంభికోట పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొడామర్ గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘనటకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం పొడామర్ గ్రామానికి చెందిన సంజయ్ కందపాణి (30) అనే యువకుడు ఏదో పనిపై కుంభికొట బస్టాండ్ వద్ద నిలబడ్డాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు అతనిపై ఆకస్మాతుగా మరణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కందపాణిని అక్కడి వారు కొందరు కుంభికొట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని కుటుంబీకులు ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పోలీసుల అదుపులో నిందితులు

యువకుని దారుణ హత్య