
వంతెనపై వరద నీరు
ఎఫ్‌టీఏలో ఉనికి కోల్పోయిన ఒడిశా
యువతి అనుమానాస్పద
మృతి
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల చంద్రశేఖర్‌పూర్ పోలీసులు చంద్రశేఖర్‌పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్‌లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
● పట్టుబడిన రూ. 2.44 కోట్ల నగదు, విలువైన బంగారు ఆభరణాలు
● విలువైన భవనాలు ఉన్నట్టు గుర్తింపు
జయపురం: కొరాపుట్ జిల్లా జయపురం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపక్ విజిలెన్స్ వలలో పడ్డారు. పట్టణం సోంబారు తోట వీధిలోని అతని భవవనంలో, ప్రసాదరావుపేటలోని ఇంటిపైన బిజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అతనికి సోంబారుతోటతోపాటు ప్రసాదరావుపేటలో ఇల్లు, ఎన్‌కేటీవో రోడ్డులో ఒక ఇల్లు, మరో అపార్ట్‌మెంట్, భువనేశ్వర్‌లో మరో భవనం, జయపురం ప్రాంతంలో 26 ఎకరాల పంట భూమి ఉన్నట్లు ఇంతవరకు ఆధారాలు లభించినట్లు కొరాపుట్ ప్రాంతీయ బిజిలెన్స్ ఎస్పీ నరేంద్రకుమార్ పాఢీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇంకా మరికొన్ని ప్రాంతాలోని అతని ఆస్తులపై జయపురం విజిలెన్స్ విభాగ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
ఇంతవరకు రెండు కోట్ల 44 లక్షల రూపాయల నగదు, 500 గ్రాముల బంగారు నగలు, రెండ కేజీల వెండి, వాటితో పాటు మరికొని విలువైన బంగారు నగలు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
భువనేశ్వర్: యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారత దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుతుర్చుకుంది. ఈ ఏడాది జూలై 24న ఈ చారిత్రాత్మక ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రముఖుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పాదనలు, వస్త్రాలు, క్రీడా సామగ్రి, నగలు, ఆభరణాలు, బొమ్మలు, పింగాణి, తోలు, పాదరక్షలు, రబ్బరు వంటి ఉత్పాదనల క్రయవిక్రయాలకు మార్గం సుగమమైంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ, పేరొందిన ప్రాంతీయ ఉత్పాదనలు యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఎగుమతి అవుతాయి. ఈ జాబితాలో ఒడిశాకు స్థానం లభించక పోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో 25 పైబడి భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు పొందిన ఉత్పత్తులు పేరొందాయి. ఈ జాబితాలో కంధమల్ పసుపు నుంచి ప్రత్యేకమైన వస్త్రాలు, హస్తకళల వరకు, కంధమాల్ హల్ది, సంబల్‌పురి చీర, రఘురాజ్‌పూర్ విభిన్న కళాకృతులు (పొట్టా చిత్రాలు), కటక్ వెండి తీగల అల్లిక సామగ్రి తదితర పలు ఉత్పాదనలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటీ యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) జాబితాలో చోటు చేసుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి అరకు కాఫీ ఈ ఒప్పందంలో చోటు చేసుకుంది. వాస్తవానికి అరకు వ్యాలీ అరబిక కాఫీగా ఉభయ ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాకు సంయుక్తంగా భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు మంజూరైంది. ఎఫ్‌టీఏ ఒప్పందం జాబితాలో ఈ ఉత్పాదనని ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేసి స్థానం కల్పించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రం నుంచి 20 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులతో రాష్ట్ర మహిళ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. భారత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఘనమైన బలం ఉన్న రాష్ట్రంలో స్వదేశీ ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం ఉనికిని పరిరక్షించడంలో తమ సమర్థతని ప్రదర్శించడంలో విఫలమైనట్లు విమర్శలు పుంజుకుంటున్నాయి.
2.63 యూఎస్ బిలియన్ డాలర్లు టర్నోవరుతో ఒడిశా యూఏఈ యొక్క 8వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుంది. ఈ పరిస్థితులు యునైటెడ్ కింగ్‌డమ్‌తో ఒప్పందం సందర్భంగా పరిగణనలోకి తీసుకోకపోవడం తాజా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో రాష్ట్రం ఉనికి కనుమరుగైపోయింది. ఈ పరిస్థితిని సవరించే దిశలో ఉభయ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. ఒడిశా ఇటీవల మామిడి, బొప్పాయి, పసుపు వంటి ఆహార ఉత్పాదనల్ని యునైటెడ్ కింగ్‌డమ్‌కి ఎగుమతి చేయడం ప్రారంభించింది. దీని విస్తరణ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ రకాల ఆహార, వస్త్ర తదితర దైనందిన జీఐ ఉత్పాదనలు పుష్కలంగా ఉన్నాయి. వాటి ప్రపంచ వ్యాప్త ప్రోత్సాహానికి సరైన ప్రాతినిధ్యం లేదని తాజా ఎఫ్‌టీఏ ఒప్పందం స్పష్టం చేసింది. సంస్థాగత మద్దతుతో వ్యవసాయ ఉత్పాదన ఎగుమతి సంస్థలతో అనుసంధానం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఉనికి బలపడుతుంది.
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల, పోడియా సమితుల మధ్య ఉన్న కన్యాశ్రమం వద్ద గల వంతెన నీట మునిగింది. మల్కన్‌గిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంతెన పై శుక్రవారం ఉదయానికి 2 అడుగుల వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం 9 గంటల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అయి మల్కన్‌గిరి నుంచి కలిమెల, ఎంవీ 79, మోటు వైపు నుంచి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పొడియా సమితికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.
వాన కొనసాగితే శనివారానికి పోట్టేర్, ఎంవీ 90 గ్రామం, కంగుర్‌కొండ, ఎంవీ 96 గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వంతెనలు కూడా నీట మునిగే అవకాశం ఉంది.

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు

వంతెనపై వరద నీరు