
‘సుభద్ర శక్తి కేఫ్’ ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సుభద్ర శక్తి కేఫ్‌ను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జిల్లాలో మహిళల వికాసానికి మహిళా స్వశక్తీకరణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని జిల్లా కలెక్టర్ దాస్ అన్నారు. గుసాని సమితి మా మంగళా స్వయంసహాయక గ్రూపు మహిళలు సుభ ద్ర శక్తి కేఫ్ నడిపించడానికి ముందుకు వచ్చారు. ఈ కేఫ్‌లో తక్కువ ధరలకే భోజనం, టిఫిన్ అందుబాటులో ఉంటుందని మహిళా గ్రూపు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆదనపు జిల్లా మాజిస్ట్రేటు ఫల్గుణీ మఝి, జిల్లా పరిషత్తు ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, జిల్లా సమగ్ర గిరిజనాభి వృద్ధి శాఖ, ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, ఒడిశా జీవనోపాధుల మిషన్ అధికారి టిమోన్ బోరా, తదితరులు పాల్గొన్నారు.

‘సుభద్ర శక్తి కేఫ్’ ప్రారంభం