రాయగడ: ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారికి స్థానిక కస్తూరీనగర్‌కు చెందిన మహిళలు అత్యంత ప్రీతికరమైన మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. కస్తూరీనగర్‌లోని సత్యనారాయణ స్వామి మందిరం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి అమ్మవారికి శ్రావణమాసం సారెను మంగళ వాయిద్యాల నడుమ అందజేశారు. పిండి వంటలు, గాజులు, పసుపు, కుంకుమ, చీర వంటి వస్తువులను అమ్మవారికి సమర్పించారు. మజ్జిగౌరి అమ్మవారి ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ బెరుకొ ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇకపై ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి సారెను సమర్పించడం సాంప్రదాయంగా కొనసాగిస్తామని కస్తూరీనగర్ ప్రాంత మహిళలు తెలియజేశారు. ఇదివరకు బుదరావలస, కళాశాల రోడ్డు తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు అమ్మవారికి ఆషాడ మాసం సారెను సమర్పించుకున్న సంగతి తెలిసిందే.
మజ్జిగౌరికి శ్రావణ మాసం సారె
మజ్జిగౌరికి శ్రావణ మాసం సారె
మజ్జిగౌరికి శ్రావణ మాసం సారె