
అధికారులకు అవార్డులు
రాయగడ: రాజధాని భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవనంలో బుధవారం ఆకాంక్ష జిల్లాల కలెక్టర్లు, సమితి కేంద్రాల అధికారులకు ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మఝి బుధవారం పురస్కారాలు అందజేశారు. రాయగడ జిల్లాలోని మునిగుడ, పద్మపూర్ సమితుల బీడీఓలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి కూడా పాల్గొన్నారు. గర్భిణుల నమోదు ప్రక్రియ, మధుమేహ స్క్రీనింగ్ పరీక్షలు, బీపీ, మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆరోగ్య కార్డుల పంపిణీ తదితర అంశాల్లో సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించినందుకు మునిగుడ బీడీఓ కృష్ణ చంద్ర దలపతికి కాంస్య పథకం, పద్మపూర్ బీడీఓ కురేష్‌కుమార్ జానీకి రజత పతకం ప్రదానం చేశారు.
● పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత నాలుగు పతకాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. నీతి అయోగ్ ద్వారా 2018లో గుర్తించిన ఆకాంక్ష బ్లాకులు గుమ్మాబ్లాక్ బి.డీ.ఓ. దులారాం మరాండికి రజత పతకం, ఆర్.ఉదయగిరి బ్లాక్ బీడి.ఓ.లారీమాన్ ఖర్సల్‌కు కాంస్య పతకం, పూర్వ కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్‌కు ప్రత్యేక పురస్కారం అందజేశారు.
● మల్కన్‌గిరి: ఆరు విభాగాల్లో మల్కన్‌గిరి జిల్లా అధికారులు పతకాలు సాధించారు. పతకాలు అందుకున్న వారిలో పూర్వ కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పాటిల్, జిల్లా అభివృద్ధిఅధికారి నరేశ్‌చంద్ర శబర్, చిత్రకొండ సమితి బీడీఓ ప్రీతాకుమారీ, ఖోయిర్‌పూట్ బీడీఓ ఉమా శంకర్ కోయా, మత్తిలి బీడీఓ ప్రమోద్ కుమార్ బెహరా పతకాలు అందాయి.

అధికారులకు అవార్డులు

అధికారులకు అవార్డులు

అధికారులకు అవార్డులు