
లోకాయుక్త ఫిర్యాదుపై సర్వే
జి.సిగడాం: మండల కేంద్రంలోని 92/8 సర్వే నంబరులో ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించి కల్యాణ మండపంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల పి.జగదీశ్వరరావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 14వ తేదీన మండల సర్వేయర్, తహసీల్దార్ సమక్షంలో సర్వే చేపట్టారు. వీరు చేసిన సర్వే సక్రమంగా లేదని, జిల్లాస్థాయి అధికారులతో సర్వే చేపట్టాలని జగదీశ్వరరావు మరలా కోరారు. దీంతో బుధవా రం లోకాయుక్త అధికారి సమక్షంలో ఆ భూమిని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏడీలు కె.రమే ష్, కె.రమణమూర్తి, డీఐవోలు అనుపోజు వెంకటేశ్వరరావు, ఎ.మన్మథరావు అధ్వర్యంలో సర్వే చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు.