
బీజేపీ యువమోర్చా నేతల నిరసన
జయపురం : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ నారాయణ ప్రధాన్‌పై కొరాపుట్ జిల్లాలోని బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదిత్ 19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణదాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా యువ మోర్చ సాధారణ కార్యదర్శి సరోజ్ కుమార్ పాణిగ్రహి, బొరిగుమ్మ సమితి మూడు మండలాల అధ్యక్షులు బిఘ్నేశ్వర షొడంగి, సుభిమల్ భట్ట, చక్రధర్ గదబ పాల్గొన్నారు.