
అక్రమ మైనింగ్ అడ్డగింత
కొరాపుట్: అక్రమ మైనింగ్‌ని అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి లుంగ్రి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే జిల్లా మైనింగ్ అధికారులు సిమిలిగుడ పోలీసులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల రాకను గమనించిన మైనింగ్ చేస్తున్న వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే తవ్వకాల కోసం వినియోగిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్‌ని అధికారులు సీజ్ చేసి సిమిలిగుడ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.