
జాతీయ మార్కెట్లో గుర్తింపు తీసుకువస్తాం
కొరాపుట్: తరతరాలుగా కొరాపుట్ జిల్లాలో పేరెన్నిక గల ఉత్పత్తులను జాతీయ మార్కెట్ గుర్తింపు తెస్తామని జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ప్రకటించారు. బుధవారం కలక్టరేట్లో జరిగిన సమీక్షలో ప్రసంగించారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గిరిజనులు పండిస్తున్న కాలా జిర (నల్ల ధాన్యం), కొరాపుట్ కాపీ పంట, కొట్పాడ్లో గిరిజనుల నేత చీరలు ముఖ్యమైనవని అన్నారు. ప్రభుత్వ ఎంఎస్ఎంఈ విభాగంతో కలిసి వీటి మార్కెటింగ్ దేశీయ స్థాయిలో చేస్తామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరాపుట్ బ్రాండ్‌తోనే విక్రయాలు జరుగుతాయన్నారు.