
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
● ఇద్దరు ఒడిశా ఇంజినీర్లు మృతి
కొరాపుట్: హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందారు. ఆదివారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో జయపూర్ బొయివీధికి చెందిన గిడుతూరి భానుప్రకాష్ (37), రౌర్కెలాకి చెందిన నళీని బిశ్వాల్ (33) మృతి చెందారు. వీరిద్దరూ కారులో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భానుప్రకాష్ తండ్రి జి.రాధాకృష్ణ జయపూర్ డీఐసీలో విశ్రాంత ఉద్యోగి. మృతులిద్దరూ స్నేహితులు కావడంతో హైదరాబాధ్‌లో ఒకేచోట ఉంటున్నారు. భాను ప్రకాష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. నళినీ బిశ్వాల్‌కి తలిదండ్రులు లేరు. దీంతో ఇద్దరి మృతదేహాలను జయపూర్ తీసుకొస్తున్నారు.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం