‘విశ్వ విద్యాలయంగా ఆమోదించాలి’
పర్లాకిమిడి: శ్రీకృష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు పూర్వవైభవం రావాలంటే విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం అమోదించాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఆదివారం ఎస్.కె.సి. జి.కళాశాల పూర్వపు విద్యార్థుల సంఘం రెండవ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే రూపేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి గౌరవ అతిథులుగా విశ్రాంత ప్రొఫెసర్ బిపిన్ నాయక్, పూర్వపు విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ శంకర్ ప్రసాద్ భక్షి, చికిటి ఎమ్మెల్యే మనోరంజన్ గ్యాన్ సామంతరాయ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జితేంద్ర పట్నాయిక్, నాజిర్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ప్రొఫెసర్ బిపిన్ నాయక్‌ను ఎమ్మెల్యే చేతులమీదుగా సన్మానించారు. అలాగే అంతర్జాతీయ, రాష్ట్ర ఖ్యాతి గాంచిన అథ్లెట్ కిశోర్ చంద్ర రథ్, బిష్ణుమోహన్ అధికారిని అధికారులు సత్కరించారు.


