● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. మోహన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి సెయింట్ పీటర్స్ చర్చి వరకూ శిలువను పట్టుకుని క్రిస్టియన్లు శోభాయాత్ర జరిపారు. ఈ శోభాయాత్రలో ఫాదర్ ఇసాక్ నాయక్‌తో పాటు అనేక మంది పాల్గొన్నారు. జిల్లాలోని పిండికి, బోడోపద, గుమ్మా, పర్లాకిమిడిలో పురుషోత్తం బాప్టిస్టు చర్చి, రామన్ కాథలిక్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
జయపురంలో..
జయపురం: జయపురంలో జేఈఎల్‌జీ చర్చ్‌లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు జరిగాయి. ఏసుక్రీస్తును శిలువ వేసిన దినంగా గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటామని ఫాదర్ తెలిపారు.
● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే


