గురుకుల విద్యార్థులకు బంగారు పతకాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు బంగారు పతాకాలు, మరో పది మంది విద్యార్థులు వెండి పతకాలు సాధించారు. విజయవాడలో ఈ నెల 5న డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 12వ ఆల్ ఇండియా చిల్డ్రన్ అండ్ యూత్ ఆర్ట్ కాంపిటీషన్, ఎగ్జిబిషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు కంచిలి గురుకుల విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను పంపించారు. వాటిలో ఎంపిక కావడంతో మంగళవారం ప్రపంచ ఆర్ట్ దినోత్సవం సందర్భంగా గురుకుల ప్రిన్సిపాల్ బమ్మిడి అప్పారావు చేతుల మీదుగా పతకాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబర్చిన మరో 80 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. గురుకుల కళాశాల ఆర్ట్స్ ఉపాధ్యాయుడు దిక్కల మన్మథరావుకు జాతీయ బాల ఉత్తమ చిత్రకళ అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ పైల గణపతిరావు, డి.మల్లికార్జునరావు, సూపరిండెంట్ గేదెల జయరాం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు, ఆర్ట్ టీచర్‌కు షీల్డ్‌లు అందజేస్తున్న ప్రిన్సిపాల్


