నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టొద్దు
కొరాపుట్: నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టవద్దని బీజేడీ ఎంపీ, ఒడియా సినీ హీరో ముజిబుల్లా ఖాన్ (మున్నా) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి సెమిఖొడ్ర పంచాయతీ ఖండ గ్రామంలో జన జాగృతి మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గిరిజన మహిళలనుద్దేశించి ప్రసంగించారు. అప్పుడే పుట్టిన శిశువుల పొట్టలపై కొడవలిని కాల్చి వాతలు పెట్టడంతో అనాగరికమన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఇటువంటి వాతలు పెట్టే మంత్రగత్తెలను పొలీసులు అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో సయాద్ కాజం మదాని తదితరులు పాల్గొన్నారు.
నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టొద్దు


