సంప్రదాయ వంటల ప్రదర్శన
రాయగడ: రాష్ట్రావతరణ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక సంసృతి భవన ప్రాంగణంలో ఆదివారం ఒడిశా సంప్రదాయ వంటల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో జిల్లాలొని 12 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రాపండ, కౌన్సిలర్ మంజులా మినియాకలు అతిథులుగా వచ్చి వంటల ప్రదర్శనను తిలకించారు.
అదిరిన రుచులు
పర్లాకిమిడి: ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా పర్లాకిమిడి డీఆర్‌డీఏ పంచాయతీ రిసోర్సు భవనంలో ఆదివారం ఉదయం ఒడియా పిండివంటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 13 మందికి పైగా స్వయం సహాయక మహిళా గ్రూపులు పాల్గొని రాగి సున్నండలు, కేకులు, పాయసం, కక్కరాలు, గారెలు తదితర వంటకాలు ప్రదర్శించారు. పోటీల్లో ప్రథమ బహుమతి రిమా సహా గెలుపోందగా, ద్వితీయ, తృతీయ బహుమతులు సునితా ప్రధాన్, రీనా మహారాణాలు గెలుపొందారు.
సంప్రదాయ వంటల ప్రదర్శన


