స్వగ్రామంలో సామవేదం షణ్ముఖశర్మకు ఆత్మీయ సత్కారం
పర్లాకిమిడి: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మను దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. స్థానిక జంగం వీధి జంక్షన్ సింహాద్రి ఫంక్షన్ హాలులో సామవేదం షణ్ముఖ శర్మను దక్షిణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రవి, ఉపాధ్యక్షులు మరువాడ శివరామకృష్ణలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ తాను పుట్టింది గంజాం జిల్లా అస్కాలో అయినా నా విద్యాభ్యాసం పర్లాకిమిడి శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో జరిగిందన్నారు. ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని ఒక నిర్ధిష్టమైన వాస్తుశాస్త్రాన్ని అనుసరించి అప్పటి మహారాజులు నిర్మించారని అన్నారు. పర్లాకిమిడిలో దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం, ఆత్మీయులు చాలా ఏళ్ల తర్వాత ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఆత్మీయ సభలో వెల్లంకి కూర్మనాథం, కార్యదర్శి గుడిమెట్ల శ్రీనివాస రావు, చెట్టి వెంకటేశ్వర్లు తదితరులు సహకరించారు.


