తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం

Apr 9 2025 1:06 AM | Updated on Apr 9 2025 1:06 AM

తెలుగ

తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం

జయపురం: జయపురంలో ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు, పట్టణంలో అన్ని భాషల ప్రజలకు చిరపరిచితులైన ఎ.ప్రసాదరావు మాస్టార్‌ కన్నుమూశారు. ఈయన మరణంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. జయపురంలో ఆబాల గోపాలం వరకు గేష్‌ మాస్టారుగా పిలువబడే ప్రసాదరావు (86) పట్టణంలోని తన నివాసంలో సోమవారం మరణించారు. ఆయన మృతి సమాచారం తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు వచ్చి మృతదేహాన్ని దర్శించుకొని నివాళులర్పించారు. ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి రిటారైన తరువాత గ్యాస్‌ పొయ్యిలు మరమ్మతులు చేయటం ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన విద్యా ప్రగతికి అందించిన సేవలకు, మెచ్చి జయపురం ప్రజ్ఞాభారతి సంస్థతో పాటు పలు సంస్థలు ప్రసాదరావుకు సన్మానాలు చేసి గౌరవించాయి. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

బలిమెల సమస్యలపై

సీఎంకు వినతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో మంగళవారం బలిమెల ప్రాంతాంలోని సమస్యలపై సీఎం మోహన్‌ చరణ్‌ మఝికి భువనేశ్వర్‌లో వినతి పత్రం అందజేశారు. బలిమెల నగరంలో ఈ –లైబ్రరీ నిర్మాణం, మినీ స్టేడియం వద్ద గ్యాలరీ నిర్మాణం గురించి వివరించారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌ సమితి పరిధి శాంతినగర్‌ వద్ద సోమవారం బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. కల్యాణ సింగుపూర్‌ నుంచి బిసంకటక్‌, మునిగుడ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు శాంతినగర్‌ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొంది. దీంతో బస్సు ముందరిభాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో 56 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి గాయాలవ్వలేదు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగుర్‌కొండ పంచాయతీ ఎం.వి.24 గ్రామం వద్ద మంగళవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కలిమెల సమితికి చెందిన సహిల్‌ కబిరేష్‌ (36) బైక్‌పై కలిమెల నుంచి మల్కన్‌గిరి వైపు వస్తుండగా బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి సహిల్‌ కిం రాళ్లపై పడిపోయాడు. గమనించిన స్థానికులు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. ప్రమాద సమాచారాన్ని కలిమెల పోలీసులకు ఇవ్వగా.. ఐఐసీ చంద్రకాంత్‌ మల్కన్‌గిరి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోద్‌ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు.

తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం 1
1/1

తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement