ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ

Apr 8 2025 7:39 AM | Updated on Apr 8 2025 7:39 AM

ఒడియా

ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ

కొరాపుట్‌: ఒడిశా భాషా పరిరక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒడియా పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో లాంఛనంగా తన సొంత నియోజకవర్గం ఉమ్మర్‌కోట్‌ లో ఈ పథకం ప్రారంభించారు. ప్రాథమిక విద్య కోసం బాలలకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్‌ డాక్టర్‌ శుభంకర్‌ మహాపాత్రో, జొరిగాంలో స్థానిక ఎమ్మెల్యే నర్సింగ బోత్ర,నబరంగ్‌పూర్‌ పట్టణంలో నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి పాఠ్యంశాలు పంపిణీ చేశారు.

వీధికుక్కలకు గర్భనిరోధక టీకాలు

జయపురం: పట్టణంలో వీధి కుక్కలను నియంత్రించేందుకు జయపురం మున్సిపాలిటీ కుక్కలకు గర్భ నిరోదక టీకాలు వేయడాన్ని సోమవారం ప్రారంభించింది. నెలకు దాదాపు 200 మందికిపైగా కుక్కకాటుకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 3 వేలకు పైగా ఊర కుక్కలు తిరుగుతున్నాయి. వీటి బెడద తగ్గించడానికి గర్భ నిరోధక టీకాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం పశు వైద్య డాక్టర్లతో పాటు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థులకు సన్మానం

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో 636 మంది విద్యార్థులు జాతీయ ప్రతిభా మేధాశక్తి స్కాలర్‌షిప్‌ కోసం అర్హత పరీక్షను రాశారు. వారిలో 32 మంది ప్రతిభ కనబరిచారు. అందులో మల్కన్‌గిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుముటిగూఢ ప్రభుత్వ ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న పరుశురామ్‌ సోడి, రాజేష్‌ మాడ్కమిలు ఎంపికయ్యారు. వీరిని సోమవారం జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్‌ చంధ్ర సభర పాఠశాలలో సత్కరించారు. ఒక్కో విద్యార్థికి రూ.50వేలు మంజూరైనట్లు తెలిపారు.

మంచమే పల్లకిగా మారె..

కొరాపుట్‌: మాజీ మంత్రి, మాజీ ఎంపీ జయరాం పంగి సోమవారం కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో పర్యటించారు. అదే మార్గంలో తన స్వగ్రామం తురియా వచ్చింది. గ్రామంలో చైత్రపర్వం జరుగుతోందని చెప్పడంతో.. వెంటనే పంగి ఊరిలోకి ప్రవేశించారు. దీంతో స్థానికులు ఆయనను మంచంపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. స్థానికులు చూపిన ప్రేమకు పంగి భావోద్వేగానికి గురయ్యారు.

ఖుర్దాలో బాంబు పేలి ఒకరి మృతి

భువనేశ్వర్‌: ఖుర్దా ప్రాంతం సొఢై గొడొ గ్రామంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ పై బాంబు తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బాంబుతో బైక్‌పై నుంచి కిందకి పడడంతో బాంబు పేలింది. మృతుడిని సొఢై గొడొ గ్రామస్తుడు నిరాకర్‌ సింఘ్‌గా గుర్తించారు. గాయపడిన యువకుడు బంటీ బరిసల్‌గా పేర్కొన్నారు. క్షతగాత్రుడిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఇదే ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.

ఒడియా పుస్తకాలు పంపిణీ చేస్తున్న

మంత్రి నిత్యానంద గొండో

ఒడియా పాఠ్య పుస్తకాల  పంపిణీ 1
1/2

ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ

ఒడియా పాఠ్య పుస్తకాల  పంపిణీ 2
2/2

ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement