చల్లపల్లి: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు, కొత్త పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి వంటి అంశాలు ప్రభుత్వాన్ని బతిమిలాడితే రావని పోరాటాలు చేసి సాధించుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మాజీ ఎమ్మెల్సీలు కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఆదివారం జరిగింది. తొలుత జాతీయ పతాకాన్ని యూటీఎఫ్ జిల్లా పూర్వ గౌర వాధ్యక్షుడు జి.వి.తాతారావు, ఎస్‌టీఎఫ్‌ఐ పతా కాన్ని సీనియర్ నాయకుడు పాగోలు రమేష్, యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా మాజీ ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.ఎస్.ఆర్.మూర్తి ఆవిష్కరించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ షాకత్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన సభలో కె.ఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు ప్రసంగించారు. అనుకు న్నది సాధించే వరకూ అలుపెరుగని పోరాటం చేసే సంస్థ యూటీఎఫ్ అని పేర్కొన్నారు. 2027 మర్చిలో జరగనున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఎం.హనుమంతరావును సభకు పరిచయం చేశారు. హనుమంతరావు విజయానికి యూటీఎఫ్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హనుమంతరావు మట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
టెట్ విషయంలో లోకేష్ జోక్యం చేసుకోవాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని కోరారు. టెట్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ మూడో తేదీన నిర్వహిచే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకరావు కార్యదర్శి నివేదికను, కోశాధికారి ఎం.వరప్రసాద్ ఆర్థిక నివేదికలను, సహ అధ్యక్షురాలు టి.ఝాన్సీ మహిళా నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ.ఉమామహేశ్వరరావు, ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర రావు, ఎన్.నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు పి.వినోద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు


