మచిలీపట్నంఅర్బన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రీఆర్గనైజ్డ్ టీచర్స్ యూనియన్ (డీపీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ డి.శ్రీను డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపుతోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ డీపీఆర్‌టీయూ (ఆంధ్రప్రదేశ్) కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. పీఆర్సీ కాలపరిమితి పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం సరికాదన్నారు. వెంటనే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జి.వి. ఎస్.పెరుమాళ్లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యా యులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రాంబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను రూపొందించి, తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు బి.విజయలక్ష్మి, కె.గౌరీ, గౌరవ అధ్యక్షుడు డి.సత్యనారాయణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


