ఇబ్రహీంపట్నం: స్థానిక రింగ్ సెంటర్‌లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్త్ను ట్రాఫిక్ పోలీసులపైకి ఓ కారు ప్రమాదవశాత్తూ దూసుకొచ్చింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. టైర్ ఊడిపోయి డివైడర్‌ను ఢీకొట్టి పోలీసుల సమీపంలో కారు ఆగిపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆర్‌ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం మేరకు.. హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ హైవే మధ్యన ఉన్న రింగ్‌ను గుర్తించడంలో విఫలమయ్యాడు. రింగ్ సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కారు టైర్ విరిగిపోయి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌కు రెండు మీటర్ల దూరంలో ఆర్‌ఎస్‌ఐ శివరామకృష్ణ, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి సమీపంలోకి వచ్చి కారు ఆగిపోవ డంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు టైర్ విరిగి పోకుండా ఉంటే పోలీసులపైకి కారు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కారును యాక్షి డెంట్ టోయింగ్ వ్యాన్‌తో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


