విజయవాడ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన నాగభైరవ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. డాక్టర్ పూర్ణచందు మినీ కవితను ఉద్యమంలో ప్రజలలోకి తీసుకొని వెళ్లారు. ఆయన 120 పైగా వైద్య, సాహిత్య సంబంధించిన గ్రంథాలను రచించి ప్రచురించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థ్ధాపకుడిగా ఐదు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సవ్యసాచి అటు సాహిత్య గ్రంథాలతోపాటు ఆయుర్వేద గ్రంథాలను ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది, కళారత్న పురస్కాలతో సత్కరించింది. జీవీ పూర్ణచందు పురస్కారం అందుకుంటున్న సందర్భాన్ని పురస్కారించుకొని అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్, సాహితీవేత్తలు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ గుమ్మాసాంబశివరావు, చలపాక ప్రకాష్‌లు అభినందించారు.


