వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం ● బందరు మండలం నార్త్‌ పరిధిలోని సుమారు 18 పంచాయతీల పరిధిలో దాదాపు 150కిపైగా బెల్టుషాపులకు ఓ వైన్‌షాపు యజమాని (టీడీపీ సానుభూతి పరుడు) మద్యాన్ని నిస్సిగ్గుగా సరఫరా చేస్తున్నట్లు మందుబాబులు మాట్లాడుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన వైన్‌షాపునకు వచ్చే బాటిళ్లను ఒక్కో బాటిల్‌కు రూ. 10 చొప్పున అదనంగా వేసుకుని బెల్టుషాపులకు తరలిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. అలా రోజుకు వందలాది బాటిళ్లు బెల్టు షాపులకు తరలించి లక్షలకు లక్షలు కొల్లగొట్టేస్తున్నట్లు సమాచారం. ● సుల్తానగరంతో పాటు సమీప గ్రామాలన్నింటికీ జనసేనపార్టీకి చెందిన మరో మద్యం వ్యాపారి బాటిళ్లను దాదాపు 200పైగా బెల్టుషాపులకు పంపిణీ చేస్తూ క్వార్టర్‌కు రూ. 10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● చిన్నాపురం చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే తరహాలో బెల్టుషాపులకు మందు బాటిళ్లు తరలిపోతున్నాయని, దీంతో బెల్టుషాపుల్లో క్వార్టర్‌ బాటిల్‌ను రూ. 40కు అదనంగా కొనుక్కుని తాగాల్సి వస్తోందని మందుబాబులు వివరిస్తున్నారు.

కోనేరుసెంటర్‌: కూటమి పాలనలో మద్యం సిండికేట్‌ రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేసేస్తోంది. నియోజకవర్గంలో ఓటర్‌లకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఉందేమోగానీ.. మందు చుక్క దొరకని సందు లేదు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బందరు మండలంలోని కొంత మంది మద్యం వ్యాపారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వైన్‌ షాపుల్లోని మద్యాన్ని పల్లెలతో పాటు పట్టణంలోనూ ఏరులై పారిస్తున్నారు. వైన్‌షాపుల్లో నడిచే వ్యాపారం చాలదన్నట్టు పచ్చటి పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించి మరీ దొడ్డిదారిన లిక్కర్‌ బాటిళ్లను సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగమంతా ఎకై ్సజ్‌శాఖకు తెలిసే నడుస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటంలేదని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.

తిలా పాపం తలా పిడికెడు..

బందరు మండలంలో మద్యం వ్యాపారులు అంతా కుమ్మక్కయ్యారు. పార్టీలు ఏవైనా ఒకరికొకరు స్నేహంతో మెలుగుతున్నారు. సొమ్ము ఎవడికి చేదు అన్నట్టు బెల్టుషాపులకు మద్యాన్ని తరలించి అక్రమార్జనను తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పంచుకుంటున్నారు. దీంతో అందరూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement