ఈసీ డెప్యూటీ కమిషనర్‌కు స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఈసీ డెప్యూటీ కమిషనర్‌కు స్వాగతం

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

ఈసీ డెప్యూటీ కమిషనర్‌కు స్వాగతం ఆధునికీకరణ పనుల పరిశీలన

విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఎన్నికల సంఘం డెప్యూటీ కమిషనర్‌ భానుప్రకాష్‌ ఏటూరుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ పర్యటన నిమిత్తం ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌తో కలిసి ఆయన ఎయిరిండియా విమానంలో న్యూఢిల్లీ నుంచి ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ కలంకారీ ఉత్పత్తులను అందజేసి సాదర స్వాగతం పలికారు. గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌ఓ కె. ధర్మేంద్ర తదితరులు ఉన్నారు.

డైట్‌సెట్‌ హాల్‌ టికెట్లు

డౌన్‌లోడ్‌ చేసుకోండి

గుడ్లవల్లేరు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డి.ఎల్‌.ఎడ్‌) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(డి.ఎల్‌. ఎడ్‌ సెట్‌ – 2026) హాల్‌ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అంగలూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు. ఈ పరీక్ష జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. తమ హాల్‌ టికెట్‌లోని పేరు, ఫొటో, సంతకం, పరీక్ష కేంద్రం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు గమనించినట్లయితే వెంటనే డైట్‌, అంగలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. పరీక్ష రోజు అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకురావాలని చెప్పారు.

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌ సమావేశ హాలులో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంగళవారం చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా ఆధునికీకరణ పనులను సమావేశపు హాలుతో పాటు సీఈవో, చైర్‌పర్సన్‌ చాంబర్లను కూడా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్‌సీఏ ఆనంద్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

పట్టుబడిన మాదకద్రవ్యాలు జిందాల్‌ ప్లాంట్‌లో దహనం

యడ్లపాడు(పల్నాడు జిల్లా): కృష్ణా–ఎన్టీఆర్‌ జిల్లాల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఇతర నార్కోటిక్‌ సంబంధిత పదార్థాలను పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులోని జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌లో మంగళవారం దహనం చేశారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి 364 కిలోల గంజాయి, 20 గ్రాముల ఎండీఎంఏ, 69 కిలోల ఎన్‌డీపీఎస్‌ పదార్థాలను, కృష్ణాజిల్లాకు సంబంధించి 911 కిలోల గంజాయిని శాసీ్త్రయ పద్ధతిలో దహనం చేశారు. విజయవాడ డ్రగ్స్‌ డిస్పోజబుల్‌ కమిటీ చైర్మన్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ టి.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు సీహెచ్‌ లావణ్య, రవికుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి రీజనల్‌ అధికారి నజీనాబేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement