బుడమేరు ప్రక్షాళన చేస్తామని, బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇంత వరకు కనీస చర్యలు చేపట్టలేదు. తూడు తొలగింపు పనులు సక్రమంగా చేపట్టలేదు. బుడమేరులో చెత్త్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. బుడమేరులోకి మురుగు, సెప్టిక్ వ్యర్థాలను సైతం వదలివేస్తున్నారు. బుడమేరులో చెత్త్తాచెదారం సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. గత వరదల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. వర్షకాలం వస్తోందంటే భయమేస్తోంది. అధికారులు స్పందించి బుడమేరును ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
–పూర్ణ, బుడమేరు మధ్య కట్ట


