నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం 7,96,696 ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్‌బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్‌ బొర్రా రాధా కృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కల్వకుర్తికి చెందిన భక్తులు తాడూరి సురేష్‌కుమార్‌ కుటుంబం ఆలయ అధికారులను కలిసి తాడూరి రాఘవేంద్ర పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–సర్‌ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్‌ జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బీఎల్‌వోలు ఇప్పటివరకు 7,96,696 మంది (46.87 శాతం) ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. 46,871 ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ పూర్తైనట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement