యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. అన్ని రకాల ఎరువుల సరఫరాకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్‌ యూరియా, ఇతర ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ యూరియా, ఇతర ఎరువుల శాసీ్త్రయ సమతుల్య వినియోగంతో పాటు ఏపీ ఎయిమ్స్‌ యాప్‌, పంట వైవిధ్యం, నానో ఎరువులు, డ్రోన్‌ స్ప్రేయింగ్‌ తదితరాలపై ఇంటింటి సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఏసీఎస్‌ వద్ద తాగునీరు, టెంట్‌, కుర్చీలు వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎరువుల సరఫరా, పంపిణీ లేదా ఇతర వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైన సందర్భంలో రైతులు కాల్‌ టు కలెక్టర్‌ 91549 70454లో సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. జేసీ ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి, సహకార అధికారి అజిత కుమారి, మార్క్‌ఫెడ్‌ డీఎం కె.నాగమల్లిక, వ్యవసాయ శాఖ ఏడీలు, వర్చువల్‌గా ఆర్డీవోలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement