గాలి హోరు.. వాన జోరు | - | Sakshi
Sakshi News home page

గాలి హోరు.. వాన జోరు

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

గాలి హోరు.. వాన జోరు

కొడాలి ప్రధాన రహదారిపై కూలిన తాటిచెట్టు, విద్యుత్తు స్తంభం

కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారి పై ఈదురు గాలులకు కూలిన వృక్షం

ఘంటసాల: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో ఘంటసాల మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం కాగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ప్రధాన రహదారులపై కూలిపోయాయి.

● ఘంటసాల ప్రధాన సెంటర్‌తో పాటు ఘంటసాల – అంబేడ్కర్‌, మల్లంపల్లి వెళ్లే రోడ్లు పూర్తి జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

● ఘంటసాల మండలం కొడాలి ప్రధాన రహదారిలో తాటిచెట్లు కూలి విద్యుత్‌ వైర్ల మీద పడటంలో స్తంభం కూడా కూలిపోయింది.

● కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారిలో కొడాలి రైస్‌ మిల్లు సమీపంలో, చినకళ్లేపల్లి వెళ్లే రోడ్డులో, గోగినేనిపాలెం వెళ్లే దారిలో భారీ వృక్షా లు కూలిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

● పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌ నయీమ్‌ స్పందించి సిబ్బందితో కలసి చెట్లను తొలగించడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి.

● ఘంటసాల మండలంలో తాడేపల్లి, కొడాలి, శ్రీకాకుళం శివారు సూరపనేనిపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్తు స్తంభాలు పడిపోయినట్లు విద్యుత్తు శాఖ ఏఈ రవి కుమార్‌ వివరించారు.

నేలవాలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు,

పలు రోడ్లు జలమయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement