మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణాకు డీఎస్సీ–2008, 1998లలోని మినిమం టైమ్‌స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు ఈ నెల 22న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాకు సంబంధించిన మినిమం టైమ్‌స్కేల్ ఉపాధ్యాయుల జాబితాను వెబ్‌సైట్ doekrn.wee by.com లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. హాజరుకాని ఉపాధ్యాయులకు మిగులు ఖాళీలు కేటాయించనున్నట్టు డీఈఓ స్పష్టం చేశారు.
అన్నదానానికి రూ. 50 వేల విరాళం
Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM
అన్నదానానికి రూ. 50 వేల విరాళం
గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన నన్నపనేని హరిబాబు, పద్మిని దంపతులు శనివారం రూ. 50,116 విరాళంగా అందజేసినట్లు ఆలయ ఏసీ ఎన్ సంధ్య తెలిపారు. దర్శనానంతరం దాతలకు అర్చకులు స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.
రేపు ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్
లైన్‌మేన్ నిర్లక్ష్యం.. ఎలక్ట్రిషియన్ దుర్మరణం తిరువూరు: విద్యుత్ లైన్‌మేన్ నిర్లక్ష్యం కారణంగా మండలంలోని కొమ్మిరెడ్డిపల్లిలో శనివారం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మ రణించాడు. గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులకు సబ్‌స్టేషన్ నుంచి ఎల్‌సీ తీసుకున్న లైన్‌మెన్ వాసు జి.కొత్తూరుకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ విశ్వేశ్వరరావు(45)కు పని పురమాయించారు. మరమ్మతుల నిమిత్తం స్తంభం ఎక్కిన విశ్వేశ్వరరావు పనిలో ఉండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన తదుపరి లైన్‌మెన్ అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగినందున నష్టపరిహారం చెల్లించాలని మృతదేహంతో చింతలపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
గొల్లపూడిలో అన్నదాత
సుఖీభవ నిధుల విడుదల
భవానీపురం(విజయవాడపశ్చిమ): రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, ఏఎమ్‌సీ చైర్మన్ నర్రా వాసు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 30,241 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.15.12 కోట్లు, పీఎం కిసాన్ కింద 23,258 మంది రైతులకు రూ.4.64 కోట్లు కలిపి 53,499 మంది రైతులకు రూ.19.78 కోట్ల ఆర్థిక సహాయం అందిందని వివరించారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
Advertisement


