విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2026 ● నిత్యం యోగా చేసిన వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ● దేహం, మనస్సు, భావోద్వేగాలకు గురికాకుండా, మన దైనందిన జీవితంలో వత్తిడికి గురికాకుండా ఆనందంగా గడిపేందుకు యోగా సాధన చాలా ముఖ్యమైనది. ● యోగాతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యానికి హాని కలిగించే కొలస్ట్రాల్‌, హై బీపీ, ఒబెసిటీని అదుపులో ఉంచుకునేందుకు దోహదపడుతుంది. ● శ్యాసపై ధ్యాసే ధ్యానం, మానసిక ప్రశాంతతకు చక్కటి ఔషధం. ● యోగా ముధుమేహంతో బాధపడుతున్న వారికి చాలా అవసరం. యోగా నేరుగా మధుమేహ నియంత్రణకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధనల చెబుతున్నాయి. ● నిర్ధిష్ట యోగాసనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌ స్రావాన్ని సమర్థంగా మెరుగు పరుస్తాయి. సుఖీభవ నిధుల విడుదల దుర్గమ్మ సేవలో రామ్‌దేవ్‌ బాబా –8లోu ఏసీ హంసా ఎన్టీఆర్‌ జిల్లా, సిటీ కమిటీల ఎన్నిక దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు ఎన్‌ఎఫ్‌డీబీ బృందం పర్యటన ఇగ్నైట్‌ సెల్‌కు స్కోచ్‌ అవార్డు ● యోగాను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా చేయొచ్చు. ● పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికీ యోగా వారి జీవి తంలో ఒక భాగం కావాలి. ● పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాల్లో యోగాను చేర్చారు. ● కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బందికి వత్తిడి ఉపశమనం కోసం యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

యోగాతో ఎన్నో ప్రయోజనాలు

ఒత్తిళ్ల నుంచి ఉపశమనం

జీవనశైలి వ్యాధులకు దూరం

21 అంతర్జాతీయ యోగా దినోత్సవం

మధుమేహ నియంత్రణలో కీలకం

యోగాతో చాలా ఉపయోగాలు

శారీరక, మానసిక ఆరోగ్యం

పులిచింతల సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

గొల్లపూడి ఏఎంసీ ప్రాంగణంలో శనివారం అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మను యోగా గురు బాబా రామ్‌దేవ్‌ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ హంసా ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ సిటీ విభాగాల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సెమినార్‌ హాలులో జరిగిన అసోసియేషన్‌ సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసి యేషన్‌ విజయవాడసిటీ ప్రెసిడెంట్‌గా జాలం సరోజిని, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎం.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, కార్యదర్శిగా కె.బి.సి.శేఖర్‌, కోశాధికారిగా జె.పుష్పలీల ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా ప్రెసిడెంట్‌గా వి.రామకృష్ణ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా వి.రోషిబాబు, సెక్రటరీగా రాజశేఖర్‌, కోశాధికారిగా కె.ఎ.ఎల్‌.ప్రసన్న ఎన్నికయ్యారు. అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్‌ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాగోలు రమ పరిశీలకులుగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికై న వారందరూ బాధ్యతలు స్వీకరించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.81 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. 17 రోజులకు హుండీల ద్వారా రూ.3,81,94,846 నగదు 230 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓతో పాటు ఆలయ ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, పలువురు సభ్యులు పర్యవేక్షించారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 1,707 అమెరికా డాలర్లు, 195 యూఏఈ దిర్హమ్స్‌, 52 సౌదీ రియాల్స్‌, 50 ఆస్ట్రేలియా డాలర్లు లభించాయి. కానుకల లెక్కింపులో రద్దయిన రూ.2000 నోట్లు 15, రూ.500 నోట్లు ఐదు వచ్చాయి.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మండలంలోని మంగినపూడి బీచ్‌ సమీపంలోని సత్రవపాలెం గ్రామంలో శనివారం నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) బృందం పర్యటించింది. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ శ్రీరామ శంకర్‌నాయక్‌, సీఈఓ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ బెహర్‌ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఎల్‌ వనామీ నెక్యూలియర్‌ బ్రీడింగ్‌ సెంటర్‌కు అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ జి.లక్ష్మీశ ప్రారంభించిన ఇగ్నైట్‌ సెల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కలెక్టర్‌ తరఫున జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు కార్యక్రమంలో పాల్గొని అవార్డు స్వీకరించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. దేశంలో పరిపాలన, అభివృద్ధి, సృజనాత్మక కార్యక్రమాల అమల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేసే ఈ అవార్డుకు ఇగ్నైట్‌ సెల్‌ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన కఠినమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత మూల్యాంకన ప్రక్రియలో అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఇగ్నైట్‌ సెల్‌ ప్రాజెక్టు అవార్డుకు ఎంపిౖకైందన్నారు. జాతీయ స్థాయి పురస్కారం టీమ్‌ ఎన్టీఆర్‌ జిల్లా సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్‌ సెల్‌ ఉపయోగపడుతోందని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకుల పరుగుల జీవన విధానంతో యువత నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ ఒత్తిళ్ల బారిన పడుతున్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించేందుకు జీవన పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పని వత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి వాటితో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత కొరవడింది. దీంతో శారీరక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ జీవన విధానంలో భాగమైన యోగాపై ప్రజలు దృష్టి సారి స్తున్నారు. ఇటీవల కాలంలో యోగాతో లభించే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెరి గింది. విజయవాడ నగరంలో అనేక యోగా కేంద్రాలు వెలిశాయి. ఉదయం సాయంత్రం వేళల్లో యోగా క్లాసులు నిర్వహించడంతో ఎవరికి అనువైన సమయంలో వారు వెళ్తున్నారు. ఏటా జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని జరుపుతున్నారు.

వయసుతో నిమిత్తం లేదు

యోగాసనాలతో ప్రయోజనం

యోగాతో పాటు పలు రకాల ఆసనాలు, యోగా థెరపీతో పలు రకాల వ్యాధులు, నొప్పులతో భాదపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెన్ను నొప్పితో భాదపడే వారికి భుజంగ ఆసనంతో పాటు మరికొన్ని ఆసనాలు చేయిస్తారు. అంతేకాకుండా ఆస్తమా, సైనస్‌, ఎలర్జీలకు ప్రాణయామం, బ్రీతింగ్‌ వ్యాయామాలు, గర్భిణులకు ప్రీ నాటల్‌ యోగా వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. గర్భిణులు ఆసనాలు చేయడం ద్వారా గర్భస్థ శిశువుకు సమతుల్యంగా రక్త ప్రసరణ, బ్రీతింగ్‌ జరుగుతుంది. ఇలా అనేక రకాల ఆసనాలు ప్రజలకు ఉన్న సమస్యలను బట్టి అందుబాటులో ఉన్నాయి.

యోగా దినచర్యలో భాగం కావాలి

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.3600 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

మధుమేహ వ్యాధి గ్రస్తులకు యోగా చాలా కీలకం. మెరుగైన ఆరోగ్యాన్ని కోరుకునే మధుమేహ బాధితులకు యోగాతో సాధారణ వ్యాయామమే కాకుండా క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గడం, బీపీ, షుగర్‌లు అదుపులో ఉంటాయి. ప్రాణాయామం శ్వాసమీద ద్యాసను పెంపొందించడమే కాక కోవిడ్‌ అనంతరం పరిస్థితుల్లో ఊపరితిత్తుల పనితీరును మెరుగుపరిచి, మధుమేహాన్ని అదుపుచేస్తుంది. అంతేకాక ధ్యానంతో మైండ్‌ రిలాక్స్‌, హైపోథా లమస్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో ప్రాంక్రీయాస్‌, ఇతర అవయవాల పని తీరు మెరుగుపడుతుంది.

– డాక్టర్‌ ఎం.సునీత, మధుమేహ నిపుణురాలు

కండరాలను సాగదీయడానికి, బలోపేతం చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. కండరాల ఓర్పు, సమతుల్యతను మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది. వత్తిడిని తగ్గించి చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. సున్నితమైన ఆసనాలు కీళ్లలో కదలికను మెరుగుపరిచి, ఆర్థరైటీస్‌ వంటి నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. భుజంగాసనం, మకరాసనం వంటివి వెన్నెముకను దృఢపరుస్తాయి. ప్రాణాయామం, లోతైనా శ్వాస తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

– డాక్టర్‌ జి.శ్రీరమ్య, ఫిజియోథెరపిస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement