స్వయం ఉపాధికి నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధికి నిచ్చెన

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

స్వయం ఉపాధికి నిచ్చెన

నెల రోజులు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ శిక్షణ పూర్తిచేసినమహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

అన్ని అంశాల్లో శిక్షణ..

‘సాక్షి’ మైత్రి మహిళ శిక్షణ..

మెలకువలు నేర్చుకుంటున్న మహిళలు

శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందుకుంటున్న మహిళలు

కృష్ణలంక(విజయవాడతూర్పు): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు ‘సాక్షి’ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్‌ కోర్సు శిక్షణ శనివారం విజయవంతంగా ముగిసింది. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని మేఘన హెర్బల్‌ బ్యూటీ క్లినిక్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ నెల రోజులపాటు సాగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలు థ్రెడింగ్‌, వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, ఫేస్‌ ప్యాక్‌, డాండ్రఫ్‌ ట్రీట్‌మెంట్‌, హెయిర్‌ ఫాల్‌ ట్రీట్‌మెంట్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌ స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, బ్రైడల్‌ మేకప్స్‌, గ్రూమింగ్‌, ఫేషియల్స్‌ తదితర అంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. బ్యూటీషియన్‌ వృత్తిలో నైపుణ్యాలు తెలుసుకున్నా మని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తామని శిక్షణ పొందిన మహిళలు ఆత్మ విశ్వాసంతో చెప్పారు. ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా బ్యూరో ఇన్‌చార్జి ఓ.వెంకట్రామిరెడ్డి అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఈవెంట్‌ మేనేజర్‌ శ్రీహరి పాల్గొన్నారు.

శిక్షణ పొందిన మహిళల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

సాక్షి మైత్రి మహిళతో కలిసి బ్యూటీషియన్‌ శిక్షణ తరగతులు నిర్వ హించాం. నెల రోజుల శిక్షణలో 20కి పైగా అంశాలతో పాటు ప్రాక్టికల్స్‌ కూడా చేయించాం. కస్టమర్‌ వస్తే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా మెలగాలో చక్కగా నేర్చుకున్నారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యూటీపార్లర్‌ పెట్టుకోగలమనే నమ్మకం వచ్చింది. మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్న ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు

– అందె నాగలక్ష్మి, ట్రైనర్‌, మేఘన హెర్బల్‌ బ్యూటీ క్లినిక్‌ అండ్‌ ట్రైనింగ్‌సెంటర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement