రామలింగేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే | - | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

రామలింగేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే

వీరులపాడు: మండలంలోని పొన్నవరం గ్రామంలో వేంచేసియున్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాల అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణాన్ని జరిపించారు. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ముందుగా వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎన్వీ రమణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement